కరోనా, బర్డ్ ఫ్లూ లైంటి వైరస్‌లు వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఇవి జనాలకు తెలిసిన రోగాలు..కానీ కామ్‌గా మనుషులను మింగేస్తున్న ఒక వ్యాధి మన మధ్యలోనే ఉందని ఎవ్వరికీ తెలియదు.. ఈ వ్యాధి వల్ల రోజుకు 3500 మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, వైరల్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో రోజుకు 3,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాలేయ వాపు, దెబ్బతినడం, క్యాన్సర్‌కు కారణమయ్యే వైరల్ హెపటైటిస్ అనే అంటు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండవ ప్రధాన కారణమని నివేదిక తెలిపింది.
187 దేశాల్లో ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల మరణించిన వారి సంఖ్య 2019లో 1.1 మిలియన్ల నుండి 2022 నాటికి 1.3 మిలియన్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది. ఈ మరణాలలో 83 శాతం హెపటైటిస్ బి వల్ల మరియు 17 శాతం హెపటైటిస్ సి వల్ల సంభవించాయి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రతిరోజూ 3500 మంది మరణిస్తున్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో ప్రపంచవ్యాప్తంగా పురోగతి ఉన్నప్పటికీ, హెపటైటిస్‌తో బాధపడుతున్న చాలా తక్కువ మంది వ్యక్తులు నిర్ధారణ మరియు చికిత్స పొందుతున్నందున మరణాలు పెరుగుతున్నాయి .
వైరల్ హెపటైటిస్ అంటే ఏమిటి?
వైరల్ హెపటైటిస్ అనేది కాలేయ వాపు, హాని కలిగించే ఇన్ఫెక్షన్. శరీరంలోని కణజాలం గాయపడినప్పుడు లేదా ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు వాపు ఏర్పడుతుంది.
వైరల్ హెపటైటిస్; లక్షణాలు…
జ్వరం,
అలసట
ఆకలి లేకపోవడం
వాంతులు,
కడుపు నొప్పి
లేత-రంగు మలం
కీళ్ల నొప్పులు మరియు కామెర్లు వంటి లక్షణాలు ఉన్నాయి.
ఇలాంటి లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా లేకున్నా సరే.. కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలి. డబ్బులు ఎన్నో దగ్గర వృధాగా ఖర్చుపెడుతుంటాం.. మన ఆరోగ్య మీద పెట్టేదానికి ఎందుకు అనవసరపు ఖర్చు, ఆరోగ్యంగానే ఉన్నాం కదా ఇప్పుడు ఈ పరీక్షలు ఎందుకు అనుకోకండి.