బైకును ఢీకొట్టిన దిగ్విజయ్‌ సింగ్‌ కారు.. వీడియో వైరల్

-

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ బైక్​ను ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైకర్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడిన బైకర్​ను ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం భోఫాల్‌కు తరలించారు.

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ పురోహిత్‌ తల్లి చనిపోతే గురువారం ఉదయం ఆమెకు నివాళులు అర్పించడానికి దిగ్విజయ్‌ సింగ్ కొడాక్య గ్రామానికి వెళ్లారు. నివాళులు అర్పించి, ప్రకాశ్ పురోహిత్‌ను పరామర్శించిన అనంతరం ఆయన రాజ్‌గఢ్‌కు బయలుదేరారు. రాజ్‌గఢ్‌కు చేరుకోగానే ఆయన ఫార్చ్యూనర్‌ కారు రోడ్డు క్రాస్‌ చేస్తున్న బైకర్‌ను వేగంగా ఢీకొట్టింది.

టు వే రోడ్డుపై ఎదురుగా వచ్చిన బైకర్‌ రాంబాబు (20) యూ టర్న్‌ దగ్గర రోడ్డును క్రాస్‌ చేస్తున్న సమయంలో కారు డ్రైవర్ బైకర్​ను ఢీకొట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దిగ్విజయ్‌ సింగ్‌ డ్రైవర్‌ను అదపులోకి తీసుకున్నారు. కారును సీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news