హీరోయిన్లను అందుకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు.. కృతి సనన్..!

-

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ జీవితాలపై ఎన్నో అపోహలు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు సినిమా హీరోయిన్ అంటే వింతగా అదోరకంగా చూసేవారు.. వాళ్లకి మర్యాద కూడా ఉండదు.. సినిమాల్లోకి వెళ్తే చెడిపోతారు.. చెడిపోయారు అన్న విధంగా భావించేవారు. కానీ గత కొన్నాళ్లుగా సినిమాల్లోకి హీరోయిన్స్ గా అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తుండడం, హీరోయిన్స్ గా కెరియర్ ఎంచుకోవడం, రాణించడం మనం చూస్తూనే ఉన్నాము.

కాలంతో పాటే అపోహలు కూడా తొలగిపోతున్నాయి. అయినా హీరోయిన్ అనేసరికి చూసే విధానం, ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం ఇంకా మారాల్సిందే. హీరోయిన్స్ అనే కాదు నటన వైపు అమ్మాయిలు ఎవరు వెళ్లినా సరే వారిని చాలా తక్కువ చేసి తప్పుగా ఆలోచిస్తూ ఉండేవారు చాలామంది ఉన్నారు. అందుకే హీరోయిన్లను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్కరూ ముందుకు రారు అంటూ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హాట్ బాంబు పేల్చింది. వన్ నేనొక్కడినే, దోచెయ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి పరిమితమైంది. వరుస సూపర్ హిట్స్ తో స్టార్డం అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం చేతినిండా పెద్ద పెద్ద సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ఈమె తాజాగా ఆది పురుష్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. డార్లింగ్ ప్రభాస్ సరసన నటించిన ఈమె.. ఈ సినిమా జూన్ 16వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పెళ్లిపై కామెంట్లు చేసింది.. “ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి త్వరగా పెళ్లిలు కావనే అభిప్రాయం చాలా రోజులుగా ఉంది. హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు.. యాక్టింగ్ అనేది హీరోయిన్ లైఫ్ లో ఒక భాగం అనేది ఇంకా ఓకే చేయలేకపోతున్నారు. అందుకే హీరోయిన్స్ కి పెళ్లి కావడం కష్టం.. నా కెరియర్ ప్రారంభంలో చాలామంది ఈ విషయంపై నన్ను కంగారుపెట్టే ప్రయత్నం చేశారు. కానీ నేను వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే నేను కోరుకున్న వృత్తిలో రాణిస్తున్నాను” అంటూ చెప్పింది కృతి సనన్.

Read more RELATED
Recommended to you

Latest news