స్టేట్ బ్యాంక్ లో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే… ఎంత వస్తుందో తెలుసా..?

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. చక్కటి లాభాలని పొందుతున్నారు. పైగా ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు ని కూడా ప్రకటిస్తుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఇటీవలే రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచేసింది. దాంతో వడ్డీ రేట్లను స్టేట్ బ్యాంక్ సవరించింది. అలానే లోన్లపై వడ్డీలను కూడా పెంచింది. అదే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీలు కూడా ఇస్తోంది బ్యాంకు. సీనియర్ సిజిటన్ డిపాజిటర్లకు కూడా ఎక్కువ వడ్డీ రేటు ని ఇస్తోంది. ఏడాదిలో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై వడ్డీ 6.80 శాతంగా వుంది.

ఏడాది టెన్యూర్‌ కోసం మీరు రూ.1 లక్షల ఇన్వెస్ట్ చేస్తే ఎస్‌బీఐ కాలిక్యూలేటర్ ప్రకారం మెచ్యూరిటీ పీరియడ్ అయ్యాక మీకు రూ.1,06,975 అందుదాయి. అదే రెండేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ వాటికి అయితే 6.75 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. రెండేళ్ల టెన్యూర్‌లో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే రూ.14,888 వరకు వస్తాయి.

మూడేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ కి 6.25 శాతం నుంచి 6.50 శాతం వడ్డీ వస్తుంది. రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే రూ.21,341 అదనంగా మీకు వస్తాయి. మూడేళ్ల తర్వాత చేతికి మొత్తంగా రూ.1,21,341 అందుతాయి. 10 ఏళ్ల టెన్యూర్ కలిగిన ఎఫ్‌డీలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే సీనియర్లకు అదనంగా రూ.1,10,200 వస్తాయి. సాధారణ ప్రజలకు రూ.90,500 వడ్డీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news