క్వారంటైన్ లో సీఎం కేసీఆర్.. వాస్తు పిచ్చితోనే ఇదంతా..!

-

ఒక పక్క రాష్ట్ర ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి అల్లాడిపోతుంటే.. దాన్ని అరికట్టాల్సింది పోయి సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే ఇలాంటి కష్ట సమయాల్లో ప్రజలకు సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కరోనా కేసులు నానాటికీ రెట్టింపవుతూ ఉంటే సీఎం కేసీఆర్ కనీసం సమీక్ష కూడా నిర్వహించకుండా ఫాంహౌస్‌ లోకి వెళ్లిపోయారని జీవన్ రెడ్డి  ఎద్దేవా చేశారు.

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ క్వారంటైన్ లో ఉన్నారని.. అందుకోసమే కరోనాపై గవర్నర్ నిన్న సమీక్ష నిర్వహించాలనుకున్నారని… అయితే, చీఫ్ సెక్రటరీ సహా అధికారులు ఎవరూ దీనిపై స్పందించలేదని విమర్శించారు. వాస్తు పిచ్చితో పాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని తాము కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అలా చేసి ఉంటే 10 వేల మంది రోగులకు అక్కడ వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news