వాట్సాప్‌లో డిలీట్ మెసేజ్‌లు ఎలా తెచ్చుకోవచ్చో మీకు తెలుసా

-

కుటుంబం, స్నేహితులు, ఉద్యోగం ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వాట్సాప్ గ్రూప్ అంటూ వాట్సాప్ మొత్తం గ్రూప్స్ మాత్రమే కనబడుతున్నాయి. కొన్ని సార్లు మెసేజ్ లు ఎక్కువైపోయి ఫోన్ స్పేస్ తగ్గిపోవడంతో అలాంటి సమయంలో వాట్సాప్ లో ఉన్న చాటింగ్, ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి అప్పుడు డిలీట్ చేసిన సమాచారం మరోసారి అవసరం పడవచ్చు. కాబట్టి, డిలీట్ చేసిన మెసేజ్ లు తిరిగి చూసుకోవాలంటే ఎలా అని అనుకుంటున్నారా..? ఓ చిన్న టెక్నిక్ ఫాలో అయిపోండి మీ సమాచారం యిట్టె వెనక్కి తెచ్చుకోవచ్చు.

whatsapp
whatsapp

గూగుల్ ప్లే స్టోర్ లో వాట్సాప్ రిమోట్ + అనే యాప్ ను మొదటగా డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత యాప్ అడిగిన పరిమిషన్ లను ఇస్తూనే సెటప్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఓపెన్ చేసి ఏ యాప్ ను సెలెక్ట్ చేయాలో అక్కడ అడుగుతుంది. అందులో వాట్సాప్ యాప్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత స్క్రీన్ ఫై కనిపించే ఎస్ సేవ్ ఫైల్స్ అనే ఆప్షన్ ని ఎంచుకొని అల్లోపై క్లిక్ చేయాలి. ఇంతటితో మీకు గతంలో వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ లు అన్ని ఈ యాప్ లో కనపడతాయి. ముఖ్యంగా మీరు డిలీట్ చేసిన సమాచారం కూడా ఇక్కడ కనబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news