దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలం అయింది. ఒక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా.. మిగితా రాష్ట్రాల్లో భారీగా సీట్లు కోల్పోయింది. అలాగే మరి కొన్ని రాష్ట్రాల్లో నాయకత్వం సమస్య వల్ల ఇంకా బలహీన పడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలని.. తిరిగి జాతీయ స్థాయిలో బలంగా మారాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడటంతో ప్రాంతీయ పార్టీలు ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్నాయని అన్నారు. అయితే.. ఈ పరిణామం ప్రజా స్వామ్యానికి మంచింది కాదని అభిప్రాయ పడ్డారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబై లో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా స్వామ్యం రెండు చక్రాలపై నడుతస్తుందని అన్నారు.
ఒకటి పాలక పక్షం, మరొకటి ప్రతిపక్షం అని వివరించారు. ప్రజా స్వామ్యానికి బలైమన ప్రతిపక్షం అవసరం ఉంటుందని అన్నారు. గతంలో బీజేపీ కూడా 2 ఎంపీ స్థానాల నుంచి వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చేలా ఎదిగిందని గుర్తు చేశారు.