కాంగ్రెస్‌కు హుజురాబాద్ ఉపఎన్నిక పరీక్షేనా?

-

కరీంనగర్: హుజురాబాద్‌ ఉప‌ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి పరీక్షపెడుతోందా?. కొత్త పీసీసీ నాయకత్వం .. గెలుపు కోసం వ్యూహం మార్చి ముందుకు సాగుతోందా?. కాంగ్రెస్‌ అభ్యర్థి అన్వేషణ మరింత ఊపందుకుందా?  అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

హుజురాబాద్‌లో ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది. గత ఎన్నికలో ఈ నియోజకవర్గంలో 60 వేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కూడా బలంగా ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ ఈసారి త్రిముఖ పోటీలో సత్తా చాటాలని చూస్తోంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ గూటికి చేరిపోయడంతో కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. పాత ఓట్లను తిరిగిపొందడంతో పాటు కొత్త ఓట్లను సాధించాలని భావిస్తోంది.

ప్రస్తుతం రెవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌ కావడంతో వచ్చిన జోష్‌ను హుజురాబాద్‌లో కంటిన్యూ చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. దీంతో హస్తం పార్టీ నేతలకు గులాబీ బాస్ ఆకర్షణ మంత్రం వేస్తున్నారు. పార్టీ క్యాడర్‌ను కారెక్కించే వ్యూహాలు ముమ్మరం చేశారు. దీంతో కాంగ్రెస్ లీడర్లను, క్యాడర్‌ను కాంగ్రెస్ పార్టీలు నేతలు కలుస్తున్నారు. వారికి ధైర్యం చెబుతూ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఉపఎన్నికపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.. హుజురాబాద్‌లోని గ్రామాలవారీగా ఓటర్ల లెక్కలు తీస్తున్నారు. అభ్యర్థి ఎవరన్నదానితో సంబంధం లేకుండా హస్తం పార్టీ గుర్తుతో హుజురాబాద్‌ ఉప ఎన్నికను గెలిచి.. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధమవ్వాలనే వ్యూహంతో ఆ పార్టీ అగ్రనేతలు అడుగులు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news