వృద్ధ నేతతో ‘హస్తవాసి’ మారేనా..!

-

అనేక ట్విస్ట్‌లతో కూడిన కాంగ్రెస్ అధ్యక్ష పీఠం చివరికి 80 ఏళ్ల వృద్ధ నేత అయిన మల్లిఖార్జున ఖర్గేకు దక్కేలా ఉన్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఆసక్తి చూపకపోవడంతో సోనియా గాంధీ తప్పనిసరి పరిస్తితుల్లో అధ్యక్ష పీఠంకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత అయిన రాజస్థాన్ సీఎం అయిన అశోక్ గెహ్లాత్‌ని..అధ్యక్ష రేసులో నిలబెట్టాలని చూశారు. అయితే ఆయన చేత సీఎం పదవికి రాజీనామా చేయించి..అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టాలని అనుకున్నారు.

కానీ రాజస్థాన్ సీఎం పీఠం యువ నేత సచిన్ పైలట్‌కు ఇచ్చే ఛాన్స్ ఉండటంతో రాజస్థాన్‌లో అశోక్ వర్గం పెద్ద రచ్చ చేసింది. దీంతో అక్కడ పరిస్తితులని సరిదిద్ది..అశోక్‌ని అద్యక్ష రేసు నుంచి తప్పించారు. ఆయనే స్వయంగా తప్పుకున్నారు. సరే ఇంకా అధ్యక్ష రేసులో శశి థరూర్, దిగ్విజయ్ సింగ్, అలాగే ముకుల్ వాస్నిక్ నిలుస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య శశి థరూర్ నామినేషన్ వేశారు గాని..దిగ్విజయ్, ముకుల్ సైడ్ అయ్యి..సీనియర్ నేత ఖర్గే నామినేషన్ వేశారు. అటు జార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠీ కూడా నామినేషన్ వేశారు.

దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం త్రిముఖ రేసు మొదలైంది. అయితే ఇందులో త్రిపాఠీ పోటీ నామమాత్రమే. అలాగే అధిష్టానం ఎవరికి మద్ధతు ఇవ్వడం లేదు గాని..మెజారిటీ స్థాయిలో మాత్రం ఖర్గే వైపే నిలబడుతున్నారు. అటు శశి థరూర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. కానీ మెజారిటీ చూసుకుంటే ఖర్గేకు కాంగ్రెస్ పగ్గాలు దక్కేలా ఉన్నాయి. అయితే సౌమ్యుడు, అందరితో సత్సంబంధాలు నెలకొల్పుకునే ఖర్గే.. గాంధీ కుటుంబానికి విధేయుడు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు 1999, 2004, 2013 లలో మూడు సార్లు ప్రయత్నించినా, సఫలం కాలేకపోయారు.

విద్యార్ధి దశ నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ఖర్గేకు ఇన్నాళ్లకు అవకాశం దక్కింది. 1972 నుంచి తొమ్మిదిసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు మంత్రిగా పనిచేశారు. అధికారం లేనప్పుడు అసెంబ్లీలో సీఎల్పీ నేతగా పనిచేశారు. 2009, 2014లో ఎంపీగా గెలిచారు..లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా పనిచేశారు. గత ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యారు. హిందీ, ఇంగ్లిషులలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఖర్గే…అజాత శత్రువుగా పేరు పొందారు. మరి అలాంటి నేత కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టగలరో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news