గాంధీ ఏం చేసినా అద్భుతమే – సీఎం కేసీఆర్

-

గాంధీ ఆస్పత్రిలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహా విష్కరణ చేసిన సీఎం కేసీఆర్‌….అనంతరం.. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఇవాళ మహాత్మా గాంధీ జయంతి అయిన నేపథ్యంలోనే.. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహా విష్కరణ చేశారు సీఎం కేసీఆర్‌.

ఇక ఈ కార్యక్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం ఉన్నాతాధికారులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, గాంధీ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం.. సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో మాట్లాడుతూ.. గాంధీ వైద్య సిబ్బంది గాంధీజీ సేవలను కొనసాగిస్తున్నారని అన్నారు. ధ్యానమూర్తి లో ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయం అని తెలిపారు. కరోనా సమయంలో మిగతా ఆసుపత్రులలో తిరస్కరించిన రోగులను ఇక్కడికి తెచ్చి ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు.

గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా సర్వజనీనం అన్నారు. గాంధీ మార్గంలోనే తెలంగాణని సాధించుకున్నామన్నారు సీఎం కేసీఆర్. ఈ మధ్య వేదాంత ధోరణిలో నా మాటలు ఉన్నాయని చాలామంది అన్నారని తెలిపారు. గాంధీ ఏం చేసినా అద్భుతమేనని.. ఆచరణాత్మకంగా ఉండేదని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news