పొన్నాల రాజీనామాపై స్పందించవద్దు.. నేతలకు అధిష్ఠానం హుకుం

-

ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. బీసీలకు టికెట్లు ఇవ్వడం లేదనే కారణంతో పాటు పార్టీలో రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారంటూ పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మీడియా ముందే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పొన్నాల రాజీనామా కీలకంగా మారింది.

Mr. Ponnala – It's Fate!

అయితే ఈ అంశంపై ఎవరూ స్పందించవద్దని పార్టీ అధిష్ఠానం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. పొన్నాల రాజీనామాపై నేతలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామాపై ఏమాత్రం మాట్లాడవద్దని చెప్పింది. కాగా, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉండటమే కాకుండా, మంత్రిగా పని చేసిన పొన్నాల ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనగామ నియోజకవర్గం టిక్కెట్‌ తనకు రాదనే అసంతృప్తితో ఆయన పార్టీని వీడినట్లుగా చెబుతున్నారు. ఈ టిక్కెట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందంటున్నారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సీనియర్లకు అపాయింటుమెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్నారని పొన్నాల ఆరోపణలు గుప్పించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news