కాంగ్రెస్ ది గొర్రె బతుకు – సీఎం కేసీఆర్

-

మునుగోడు టిఆర్ఎస్ ప్రజా దీవెన సభలో అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. బిజెపికి ఓటు వేస్తే మన బావి దగ్గర మీటర్ పడుతుందన్నారు. వాళ్ల గర్వం ఏంటి? దేశంలో మర్యాద, ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో 9 తోకలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. అందులో మాట్లాడేది మూడు తోకలు ఉన్నాయని.. వారు 110 మందిని శాసిస్తారట?..ఇది దేశమా? అరాచకమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

” మునుగోడు ఉప ఎన్నిక రైతుల బతుకు పోరాటం. దేశంలో మత పిచ్చి ఎవరికీ మంచిది కాదు. అంతా బాగుండాలి.. అందులో మనం ఉండాలి. దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రూపాయి విలువ 80 రూపాయలా?. మోడీ పాలనలో రూపాయి కిందపడింది. నిరుద్యోగం పెరిగింది. మీరంతా రేపు అడగాలి. మునుగోడులో అంతా ఏకమవుదాం. సిపిఐ కలిసింది.. సిపిఎం రాబోతోంది. అంతా కలిసి మనం ముందుకెళదాం. కాంగ్రెస్ ది గొర్రె బతుకు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే వృధా. మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నషాలానికి అంటాలి”. అని అన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news