ప్రభాస్ అట్టర్ ఫ్లాప్ సినిమాని తమిళం లో రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టిన కార్తీ సినిమా ఏమిటో తెలుసా?

-

వంశి పైడిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రభాస్ ని హీరో గా పెట్టి తీసిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మున్నా సినిమా 2007 మే నెలలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ వంశి పైడిపల్లి టేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి..బాగా స్టైలిష్ గా తీసాడు కానీ దురదృష్టం కొద్దీ అది ఫ్లాప్ అయ్యింది అని ప్రభాస్ అభిమానులు అంటూ ఉంటారు.

ఆ సినిమాలో ఆయన టేకింగ్ అంత అద్భుతంగా నచ్చింది కాబట్టే ఆయనకీ టాప్ స్టార్ హీరోలు వరుసగా తమతో సినిమాలు చెయ్యడానికి ఒప్పుకున్నారు..ఆ సినిమా తర్వాత వంశి పైడిపల్లి కి ఒక్క ఫ్లాప్ కూడా తగలేకపోవడం విశేషం..అయితే వంశి కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచినా ఆ సినిమాని తమిళ హీరో కార్తీ రీమేక్ చేసి ఇటీవలే బంపర్ హిట్ కొట్టాడు..ప్రస్తుతం ఈ సినిమా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని శాసిస్తుంది..ఆ సినిమా పేరు వీరుమాన్.

డైరెక్టర్ ముత్తయ్య తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ తొలిసారిగా హీరోయిన్ గా వెండితెర కి పరిచయం..మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోయాయి..మొదటి రోజు కేవలం తమిళనాడు నుండే 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కేవలం మొదటి వారంలోనే 60 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే విధంగా ట్రెండ్ కొనసాగుతుంది..ఇది కార్తీ కెరీర్ లో హైయెస్ట్ అని చెప్పొచ్చు..ఇక ఈ సినిమాకి నిర్మాతగా కార్తీ అన్నయ్య సూర్య వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిందే..హీరో గా గత కొంతకాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య కి నిర్మాతగా మాత్రం ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది..వీక్ డేస్ లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ని చూపిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఇదే ట్రెండ్ కనుక కొనసాగిస్తే ఫుల్ రన్ లో ఈ సినిమా 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉందని కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో తల్లి ని అతని తండ్రి దారుణంగా మోసం చేసి చంపేస్తాడు..తన తల్లిని చంపినా తన తండ్రి పై పాగా తీర్చుకోవడమే ఈ సినిమా స్టోరీ..అచ్చు గుద్దినట్టు ఈ సినిమా మున్నా స్టోరీ లానే అనిపిస్తుంది కదూ..కానీ ఈ సినిమా మొత్తాన్ని తమిళనాడు పల్లెటూరు వాతావరణం లో తెరకెక్కించారు..స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ కూడా తెలుగు మున్నా సినిమాకంటే చాలా మెరుగ్గా అనిపిస్తాది..కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే పెట్టారు..కానీ ఈ సినిమా తెలుగు లో ఎందుకు విడుదల చేయలేదని కార్తీ అభిమానులు సోషల్ మీడియా లో నిరసన వ్యక్తం చేస్తున్నారు..కార్తీ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ మన అందరికి తెలిసిందే..హిట్ టాక్ వస్తే ఇక్కడ ఆయన సునామి లాంటి వసూళ్లు వస్తాయి..కానీ తమిళం లో ఆ స్థాయిలో హిట్ అయినా సినిమాని తెలుగులోకి ఎందుకు దబ్ చేయలేదంటే దానికి కారణం మున్నా సినిమానే అని అంటున్నారు..ఇది ఆ సినిమా రీమేక్ అవ్వడం వల్లే తెలుగు లో రిలీజ్ చేయలేకపోతున్నాం అని దర్శక నిర్మాతలు అంటున్నారట..కనీసం OTT లో అయినా తెలుగు లో దబ్ చేసి వదిలితే బాగుండును అని కార్తీ అభిమానులు ‘వీరుమాన్’ దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news