రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం రోజు కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్రలో పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవరా రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, నేడు మహా సీఎం ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరుతున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్(ఎక్స్) వేదికగా ప్రకటించారు. 55 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికున్న సంబంధం నేటితో తెగిపోయింది. నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని నేడు ప్రారంభిస్తున్నాను అని తెలిపారు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు.
కాగా, 2014 వరకు ఆయన ప్రాతిథ్యం వహించిన ముంబై సౌత్ పార్లమెంట్ సీటుపై సందిగ్ధత నెలకొంది. దీంతో పొత్తులో భాగంగా తనకు పోటీచేసే అవకాశం లభించదనే నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
మిలింద దేవరా లోక్‌సభకు తొలిసారిగా 2004లో ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అనంతరం 2011లో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా , 2012లో అదనంగా షిప్పింగ్ శాఖను చేపట్టారు.