వరంగల్ లో మిర్చి రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ధరల్లో కోత పెట్టడాన్ని నిరసిస్తూ.. ఎనుమాముల మార్కె్ కార్యాలయాన్ని రైతులు ముట్టిడించారు. మార్కెట్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో మార్కెట్ లో లోడ్ చేసిన మిర్చి బస్తాలను ఎత్తిపడేసి మిర్చిని వెదజల్లారు. కాంటాలు కింద పడేశారు.
మార్కెట్ కార్యాలయం ముందు బైఠాయించి.. ధర్నాకు దిగారు. తేజ రకం మిర్చికి క్వింటాలుకు రూ.17200 రూపాయల ధర నిర్ణయించినప్పటికీ.. దళారులు 14 వేల రూపాయల లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చీడ పీడలతో పాటు అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను మార్కెట్ లో దళాలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. మద్దతు ధర కల్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక కాంటాలు ధ్వంసం కావడంతో… రేపు మార్కెట్ ను మూసివేస్తున్నట్లు ఎనమాముల మార్కెట్ మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. అలాగే.. 26 న గణతంత్ర్య దినోత్సవం ఉన్న నేపథ్యంలో.. ఎల్లుండి కూడా మార్కెట్ మూత పడనుంది.