కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితమే… లోక్ సభలో 2022 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె దేశంలోని నిరు పేదలకు శుభవార్త చెప్పారు. పీఎం ఆవాస యోజన పథకం కింద నిరు పేదలకు ఏకంగా 80 లక్షల ఇండ్లను నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. నిరుపేదలను ఆదుకునే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అలాగే..5.7 కోట్ల కుటుంబాలకు నల్ సే జల్ కింద మంచినీటిని అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.
వచ్చే 20 సంవత్సరాల పురోగతిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగంగా జరుగుతోందని చెప్పారు. ఆత్మ నిర్మల్ భారత్ స్పూర్తితో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని స్పష్టం చేశారు. త్వరలోనే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ రాబోతుందని ప్రకటన చేశారు. నేషనల్ హైవేస్ నెట్వర్క్ను 25 వేల కిలోమీటర్లు పెంచు తామని స్పష్టం చేశారు. వృద్ధిరేటు లక్ష్యాన్ని 9.2 శాతం అంచనా వేస్తున్నట్లు తెలిపారు.