కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు.. తిరుమల చేరుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్నిసార్లు అధికంగా.. మరికొన్ని సార్లు సాధారణంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో వైకుంఠ కాంప్లెక్స్ లోని 15 కంపార్టుమెంట్ లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని 66, 327 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.