వివాదాస్పదంగా ఫేస్బుక్ వ్యవహారం, రైతుల ఉద్యమం విషయంలో…!

-

ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ వరుస వివాదాల్లో ఉంటుంది. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం అయిన ఫేస్‌బుక్ కిసాన్ ఏక్తా మోర్చా పేజీని ఆదివారం చాలా గంటలు తొలగించడం వివాదాస్పదంగా మారింది. రైతులు అందరూ కూడా ఈ పేజీ ద్వారా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. 5 రోజుల్లో ఆ పేజీకి దాదాపు 75 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఈ బృందం వివిధ రైతు సంఘాల నుండి సమాచారాన్ని సేకరించి సమకూర్చుతుంది.

సోషల్ మీడియా వెబ్‌సైట్ యొక్క కమ్యూనిటీ ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ఈ పేజీని తొలగించినట్లు గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ అధిపతి బల్జీత్ సింగ్ తెలిపారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. సుమారు మూడు గంటల పాటు ఈ పేజీ ఫేస్బుక్ లో కనపడలేదు. భారతీయ కిసాన్ యూనియన్ కి చెందిన భూపేంద్ర చౌదరి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఫేస్బుక్ పేజీని తొలగించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఫేస్బుక్ ప్రభుత్వానికి స్పష్టంగా అనుకూలంగా చేయడం ఇదే మొదటిసారి కాదు అని ఆయన అన్నారు. తీవ్ర విమర్శల తర్వాత ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించింది. జరిగిన అసౌకర్యానికి చింతించాలి అని ఫేస్బుక్ కోరింది. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news