మద్యం ఏరులై పారుతే…నేనేం చేస్తా : ఏపీ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

ఏపీ కార్మిక శాఖ మంత్రి మంత్రి గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం ఆనుకునే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉంటుందని… మద్యం సేవించే వారు అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకుంటే.. నేనెలా అడ్డుకోగలను ? అని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అర కిలో మీటర్ దూరం లోనే పక్క రాష్ట్రం మద్యం దొరుకుతుంటే కొందరు తీసుకుని వచ్చి తాగుతున్నారని వింతగా సమాధానం ఇచ్చారు.

మద్యం ఏరులై పారుతుందంటే తానేం చేయగలను ?.. తానే మైనా అదే పనిగా కాసుకుని కూర్చుంటానా ? అంటూ తెలిపారు మంత్రి గుమ్మనూరు జయరాం. దందా దందా అంటున్నారు.. ఏం దందానో తనకు అర్థం కావడం లేదని… సీఎంగా జగన్ మోహన్‌ రెడ్డి ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు గుమ్మనూరు జయరాం. లోకేష్ అడ్డదారిలో రాజకీయల్లోకి వచ్చాడని… నలభై వేలతో గెలిచిన నాయకుడిని తానని తెలిపారు. చంద్రబాబు పుణ్యంతో లోకేష్‌ మంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు.