పుట్టినరోజున విజయ్ మీద విమర్శలు..

Join Our Community
follow manalokam on social media

తమిళ నటుడు విజయ్ సేతుపతి తెలుగు వాళ్ళందరికీ పరిచయమే. పిజ్జా సినిమాతో తిరుగులేని ముద్రవేసిన విజయ్ సేతుపతి, విభిన్న చిత్రాల్లో నటిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం మాస్టర్ చిత్రంలో విలన్ గా కనిపించిన ఈ నటుడి పుట్టినర్జు ఈ రోజే. ఐతే పుట్టినరోజున కేక్ కట్ చేసిన విజయ్ సేతుపతిపై విమర్శలు వచ్చాయి. దానికి కారణం అతడు కేక్ ని కత్తితో కోయడమే. యుద్ధాల్లో వాడే తల్వార్ తో కేక్ కోయడం వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

దీనిపై విజయ్ క్షమాపణలు చెప్పాడు. తల్వార్ తో కేక్ కోయడం కావాల్సింది చేసింది కాదనీ, అలా జరిగిపోయిందనీ, ఆ చర్య ఎవరికైనా ఇబ్బంది కలిగించినట్లయితే క్షమాపణలు తెలియజేస్తున్నానని తెలిపాడు. మాస్టర్ లో విలనిజాన్ని చూపించిన విజయ్ సేతుపతి, తెలుగు చిత్రం ఉప్పెన ద్వారా మరోసారి విలన్ గా రఫ్ఫాడించబోతున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...