సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ

-

నాగార్జునసాగర్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ లో కొత్త కొత్త అంశాలు తెర పైకి వస్తున్నాయి.ఉప ఎన్నిక కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మకం అవ్వడం చావో రేవో తేల్చుకోవాల్సి ఉండటంతో నేతల్లో టెన్షన్ మొదలైందట. ఉప ఎన్నిక పేరు చెప్పి ఏకంగా కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక సైతం వాయిదా వేయించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాగూర్ తోనే అసలు సమస్య ఉందట..ఉప ఎన్నిక వేళ ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. దుబ్బాక ఉప ఎన్నికలా పాత ప్యూహాలకే పదును పెడతారా కొత్త ప్యూహాలకు తెర లేపుతారా అని టెన్షన్ లో ఉన్నారట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు…

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోరు జానారెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు సైతం చావో రేవో అన్నట్లుగా మారింది. ఇక సీనియర్ నాయకుడు జానారెడ్డిని మీదే ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ. సాగర్ ఎన్నికల్లో గెలిస్తే గ్రామాల్లో కాంగ్రెస్‌కే ఆదరణ ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పడవ మునిగితే.. అటు పార్టీ…ఇటు జానారెడ్డి రాజకీయ జీవితం రెండు క్లోజ్ అయినట్టే అని భావిస్తుంది. అయితే ఉప ఎన్నికలో ఎలాంటి ప్యూహంతో ముందుకెళ్లాలి అన్నదాని పై పార్టీ నేతల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఠాగూర్‌ ఇంఛార్జ్‌ గా రాష్ట్రానికి వచ్చిన సమయంలోనే దుబ్బాక బైఎలక్షన్‌ వచ్చింది. అక్కడ కాంగ్రెస్‌ బలం ఎంతో తెలుసుకోకుండానే ఆయన హడావిడి చేశారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. థర్డ్‌ ప్లేస్‌ వచ్చాక.. అక్కడ మాకు ఎప్పుడూ బలం లేదని ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు కాంగ్రెస్ నేతలు. మరి నాగార్జునసాగర్‌ లో ఎలా ముందుకెళ్లాలి దీన్ని పార్టీ ఇంచార్జ్ ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్న ఉత్తమ్,కోమటిరెడ్డి ఎలాంటి ప్యూహాలు రచిస్తారు,టీఆర్ఎస్,బీజేపీని ఎలా మట్టికరిపించాలా అన్న ప్లానింగ్ లో నిమగ్నమయ్యారు ఈ సీనియర్ నేతలు. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది.

దుబ్బాకలో ప్రతి మండలానికి ఇంఛార్జిని.. ఒక్కో గ్రామంలో ఒక్కో నాయకుడికి బాధ్యతలు అప్పగించారు పార్టీ ఇంచార్జ్ ఠాగూర్. ఇక ఆ నాయకుడే ఖర్చులు కూడా భరించాలని చెప్పారు. ఇ ప్యూహం ఆ ఎన్నికల్లో బెడిసికొట్టింది. ఇక పీసీసీ పేరుతో ఠాగూర్ నడిపిన హైడ్రామాతో నేతలంతా ఎడముఖం పెడమోఖంగా తయారయ్యారు.అందుకే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పార్టీని ఠాగూర్ ఎలా నడిపిస్తారన్నది ఆసక్తిగా ఉంది. ఇక మరికొందరు నాయకులు మనకు చెప్పిందే చేద్దాం భాద్యతలు అప్పగిస్తే చూద్దాం అనే ఫీలింగ్ లో ఉన్నారట. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉద్దండులైన కాంగ్రెస్‌ నాయకులు ఏ మేరకు ఫీల్డ్‌లోకి దూకుతారో ఎలాంటి ప్యూహాలు రచిస్తారన్నది జానారెడ్డికి సైతం కాస్త టెన్షన్ కి గురి చేస్తుందట…మరీ కొత్త పంచాయతీని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే…

Read more RELATED
Recommended to you

Latest news