కరోనా అలెర్ట్; హైదరాబాద్ ఐటి కంపెనీలు సంచలన నిర్ణయం!

-

హైదరాబాద్ లో కరోనా అడుగు పెట్టగానే తెలంగాణా సర్కార్ ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఏ విధంగా కూడా వైరస్ విస్తరించకూడదు అని భావిస్తున్న తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడవద్దని ఆదేశాలు ఇచ్చిన నేపధ్య౦లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు మంత్రులు కూడా.

ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించి నిధులను కూడా విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. వంద కోట్లను కరోనాకు కేటాయించారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా విషయంలో హైదరాబాద్ ప్రజలు, ఐటి కంపెనీలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తమ ఉద్యోగులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకునే ఆలోచనలో ఉన్నాయి. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్, టీసీఎస్ వంటి సంస్థలు వర్క్ ఫ్రం హోం కి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ సంస్థలు అమెరికాలో తమ ఉద్యోగులను ఆఫీసులకు రావొద్దని ఆదేశాలు ఇచ్చేసాయి. ఇక్కడి ఆఫీసులకు కూడా యాజమాన్యం ఈ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ప్రపంచాన్ని భయపెడుతుంది ఈ వైరస్. ఇక దీని వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వానికి సహకరించాలని ఐటి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. త్వరలో ఈ నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news