దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల వరకు దేశంలో రోజూవారి కరోనా కేసులు సంఖ్య కేవలం 10 వేల లోపే ఉంటే… ప్రస్తుతం కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువైంది. దీంతో కేంద్రం కూడా అలెర్ట్ అయింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ రాష్ట్రాలకు, యూటీలకు లేఖ రాశారు. ఆసుపత్రులు.. మెడికల్ ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. కనీసం 48 గంటలకు సరిపడా బఫర్ స్టాక్ ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచుకోవాలని లేఖలో పేర్కొంది. అవసరమైన సంఖ్యలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ప్రతీ జిల్లాలో ఉండాలని సూచించింది. వెంటిలేటర్లను సిద్దం చేసుకోవాలని లేఖలో పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో… మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. రెండో వేవ్ లో దేశంలో చాలా మంది కరోనా బాధితులు ఆక్సిజన్ అందకనే చనిపోయారు. ఆసుపత్రుల వద్ద తగినంత ఆక్సిజన్ లేకపోవడంతో రోగులు పిట్టల్లా రాలిపోయారు. దీంతో ఈసారి ముందుగానే కేంద్రం జాగ్రత్తపడుతోంది. ఇందుకోసం కేంద్రం.. రాష్ట్రాలకు, యూటీలకు లేఖ రాసింది.