సైన్ నెహ్వాల్‌కు సిద్ధార్థ్ క్షమాపణలు

-

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌‌‌కు నటుడు సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల సైనాపై సిద్ధార్థ్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు సైతం చెలరేగాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రేఖా శర్మ నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్‌ను తొలగించాలని, కేసు నమోదు చేయాలని ముంబయి పోలీసులకు సమన్లు కూడా జారీ చేశారు.

అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో నటుడు సిద్ధార్థ్ దిద్దుబాటు చర్యలకు దిగారు. సైనా నెహ్వాల్‌పై చేసిన అసభ్యకరమైన జోక్‌కు క్షమాపణలు కోరాడు. తన పద ప్రయోగాన్ని సమర్థించుకున్న సిద్ధార్థ్ తన వ్యాఖ్యల్లో అసభ్యకరమైన ఉద్దేశం ఏమీ లేదని పేర్కొన్నాడు. అయినా క్షమాపణ కోరుతూ సైనాకు బహిరంగ లేఖ రాసిన సిద్ధార్థ్ దానిని అంగీకరించాల్సిందిగా విన్నవంచాడు. మీరు ఎప్పటికీ నా ఛాంపియన్ అని సైనా ఉద్దేశించి పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news