టోక్యో: ఒలింపిక్స్ క్రీడలకు ప్రారంభానికి ముందే కరోనా కలకలం రేగింది. తొలి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఈ నెల 13 నుంచి ఒలింపిక్స్ క్రీడా గ్రామాన్ని నిర్వహకులు తెరిచారు. ఈ క్రీడా గ్రామంలో క్రీడాకారులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఒకరికి పాజిటివ్ వచ్చింది. కానీ వారి పేరు బయటకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఓ హోటల్‌లో ఐసోలేషన్ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. మొత్తం 11 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ఒలింపిక్స్ ఇప్పటికే ఆలస్యమ్యాయి. గతేడాది ఈ క్రీడలు నిర్వహించాల్సి ఉంది. కరోనా కరణంగా అప్పడు వాయిదా వేశారు. తాజాగా ఒలింపిక్స్ నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాజాగా కరోనా కేసు నమోదు కావడంతో క్రీడాకారుల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒలింపిక్ క్రీడా గ్రామంలో పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. మరో ఆరు రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కరోనా కలకలం రేగింది.