ప్రపంచ దేశాలను భయాందోళను గురి చేసిన కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఆర్నెళ్ల తరువాత తొలి కోవిడ్ మరణం సంభవించింది. చైనాలో మరోసారి కరోనా పడగ విప్పుతోంది. గత కొన్నిరోజులుగా కొవిడ్ కేసులతో సతమతమవుతున్న డ్రాగన్.. చాలా నగరాల్లో కఠిన లాక్‌డౌన్లు, ఆంక్షలు విధిస్తోంది. తాజాగా ఓ వృద్ధుడు వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 6 నెలల తర్వాత ఇదే తొలి మరణమని వెల్లడించింది. ఇప్పటికే జీరో కొవిడ్ విధానంతో కఠినంగా వ్యవహరిస్తున్న చైనా అధికారులు.. ఈ ఘటన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని చైనీయులు ఆవేదన చెందుతున్నారు. చైనాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్‌లో ఓ వృద్ధుడు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 6 నెలల అనంతరం ఇదే తొలి కొవిడ్ మరణమని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు సడలిస్తున్నవేళ.. రోజురోజుకూ చైనాలో పరిస్థితి భిన్నంగా మారుతోంది. చాలా నగరాల్లో కఠిన లాక్‌డౌన్లు, క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు చైనాలో కొవిడ్ మృతుల సంఖ్య 5,227కు చేరుకున్నట్లు చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చాలా నగరాల్లో కొవిడ్ విజృంభిస్తున్నప్పటికీ.. మరణాలు నమోదు కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మే 26న షాంఘైకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. తర్వాత ఇప్పుడు బీజింగ్‌కు చెందిన 87ఏళ్ల వృద్ధుడు చనిపోయినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది.