భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (64) కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స జరిగింది. ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం కుడి కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆర్మీ ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జూలై 25న భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ద్రౌపది ముర్ము అక్టోబరు నెలలో ఎడమకంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. తాజాగా కుడికంటికి శస్త్రచికిత్స చేసిన ఆర్మీ ఆసుపత్రి వైద్యులు శుక్లాలను విజయవంతంగా తొలగించారు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము గత అక్టోబర్ 16న ఎడమ కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు.
ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల క్రితం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ దంపతులును కలిశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.