మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. తస్మాత్ జాగ్రత్త..!

-

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. కరోనా నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసుల తీవ్రత ఎక్కువౌతోంది. వ్యాక్సిన్ వచ్చేసిందనే నమ్మకంతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మాస్కులు ధరించకుండా.. సామాజిక దూరం పాటించకుండా.. సమూహంగా కలిసి ఉంటున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,285 కొత్త కేసులు నమోదు కావడం.. ఇది ఈ ఏడాదిలోనే ఎక్కువగా కేసులు నమోదు కావడం, ఇదే తొలిసారి కావడం గమనార్హం. బ్రిటన్, దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్‌లు భారతదేశంలో వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.

coronavirus
coronavirus

మొదట్లో కేసుల సంఖ్య పెరిగినా.. కోలుకునే వారి సంఖ్య కూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త కేసులు నమోదుతున్నాయి కానీ, కోలుకునే వారి సంఖ్య తగ్గతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్కరోజే 15,157 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,09,53,303కి చేరింది. రికవరీ రేటు 97 శాతంగా ఉంటే.. ప్రస్తుతం 96.86 శాతానికి తగ్గింది. రికవరీ రేటు తగ్గడంతో దేశంలో యాక్టివ్ కేసులు 2 లక్షలకు చేరువలో ఉంది. కాగా, నిన్న ఒక్కరోజే 117 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణించిన వారి సంఖ్య 1,58,306కి పెరిగింది.

మహరాష్ట్రలో పరిస్థితి దారుణం..
మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గురువారం ఒక్కరోజే 14,317 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,66,374కి చేరింది. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,06,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news