ముగిసిన 36 గంటల దీక్ష.. జగన్ ఫ్యామిలీ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !

-

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసిపి చేసిన దాడికి నిరసనగా నారా చంద్రబాబునాయుడు 36 గంటల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యే సమయానికి జగన్ పాలు తాగే వాడని… పదవి కోసం కుటుంబ సభ్యుల ను కూడా లెక్క చేయడంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు వైయస్ షర్మిల ను వాడుకుని… గెలిచిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు షర్మిలకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు.

పట్టాభి తిట్టాడని ఇప్పుడు తన తల్లి విజయమ్మ ను రాజకీయాల్లోకి లాగుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు నేను మూడు సార్లు నిరాహార దీక్ష చేశానని.. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద దాడి చేసిందన్నారు. డీజీపీ ఆఫీస్, సీఎం ఇల్లు, బెటాలియన్ దగ్గర్లోనే ఉన్నాయని.. ఏపీ నుంచే వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోందని ఫైర్ అయ్యారు. హెరాయిన్ డంప్ పట్టుకున్నారు.. దీనికి ఏపీకి లింకులున్నాయని.. ఇంతటి పెద్ద ఎత్తున మత్తు మందులు సరఫరా జరుగుతోంటే ప్రభుత్వం అలెర్ట్ కావద్దా..? అని ప్రశ్నించారు.

chandrababu naidu ys jagan

పార్టీ నేతలపై దాడులు జరిగితే సహించాం.. కానీ డ్రగ్స్ వల్ల పిల్లల భవిష్యత్ పాడవుతోందని.. అందుకే డ్రగ్స్ పై టీడీపీ పోరాటమన్నారు. దీనికి ప్రజల నుంచి సహకారం వచ్చింది కానీ.. ప్రభుత్వంలో చలనం లేదని.. సీఎంకు భయపడి అందరూ సరెండర్ అవ్వాలా..? అని ప్రశ్నించారు. ఇంత మంది సీఎంలు వచ్చారు.. ఏ సీఎం అయినా మద్యం వ్యాపారం చేయడానికి సాహసించారా..? దొంగ సారా వ్యాపారంతో డబ్బులు గుంజుతున్నారని మండిపడ్డారు.

మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టారని.. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఆడబిడ్డల తాళిబొట్లని తాకట్టు పెట్టారని అగ్రహించారు. మద్యపానం నిషేధం పేరుతో రేట్లు పెంచేశారని.. మద్యం ధరలు పెంచితే మద్యపానం తగ్గుతుందా..?అని నిలదీశారు. పక్క రాష్ట్రానికి పోయి మద్యం తెస్తున్నారు.. శానిటైజర్లు తాగేస్తున్నారని.. మద్యం ధరలు పెరగడం వల్ల తక్కువ ధరకు లభించే గంజాయికి అలవాటు పడుతున్నారన్నారు. డ్రగ్స్.. గంజాయి గురించి ఆనందబాబు మాట్లాడితే నోటీసులిచ్చారని.. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు సీఎం జగనుకు సమీక్ష జరిపే సమయం కూడా లేదా..? అని నిలదీశారు. మేం ఆధారాలిస్తాం.. పోలీసులు చొక్కాలిప్పేయండి.. ఆ ఇన్వేస్టిగేషన్ మేమే చేస్తామని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news