భారత్​లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

-

భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 6395 మంది కొవిడ్ బారిన పడ్డారు. 6,614 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కొవిడ్ రికవరీ రేటు 98.7కు పెరిగిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. యాక్టివ్ కేసులు 0.11 శాతానికి పడిపోయాని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 4,44,72,241 కేసులు నమోదు కాగా.. క్రియాశీల కేసులు 50,342 నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 5,28,090 మంది మహమ్మారికి బలయ్యారు. వైరస్ బారి నుంచి 9,00,204 కోలుకున్నారు.

దేశంలో బుధవారం 36,31,977 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 214.27 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,25,602 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 5,12,432 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,556 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,18,59,477 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,09,112 మంది మరణించారు. బుధవారం మరో 7,14,421 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 58,94,63,266కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news