ఎన్నికల బరిలో నిలిచిన కరోనా.. అసలు ట్విస్టు ఏంటంటే..!

ప్రస్తుతం దేశం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది కరోనా వైరస్. ఎంతోమంది పంజా విసిరి ప్రాణాలను బలితీసుకుంది. ఎంతోమందిని దుర్భరస్థితిలో జీవితం గడిపేలా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక విధంగా పంజా విసురుతూనే ఉంది మహమ్మారి వైరస్. రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సాధారణంగా కరోనా పేరు ఎత్తితే ప్రజలందరూ బెంబేలెత్తిపోతారు. కానీ ఇక్కడ మాత్రం కరోనాను ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నారు ప్రజలు.

కరోనా వైరస్ ను ఆదరించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే అసలు విషయం ఏమిటంటే ఇక్కడ కరోనా అంటే వైరస్ కాదు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా నేత పేరు. ఆమె పూర్తి పేరు కరోనా థామస్. కేరళలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో కరోనా థామస్ అనే మహిళ బిజెపి తరఫున కార్పొరేటర్ గా పోటీ చేస్తుంది. కాగా ప్రస్తుతం ఆమె పేరు అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతో మంది ప్రజలు సదరు మహిళను ఆదరించి గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు.