స్టాక్ మార్కెట్ కి బ్లాక్ డే…!

-

కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్ లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 807, నిఫ్టీ 251 పాయింట్లు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ ని భారీగా కూలదీసింది కరోనా భయం. సాధారణంగా సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్ ఊపు మీద ఉంటుంది. కాని అనూహ్యంగా సోమవారం ఉదయం నుంచి కూడా స్టాక్ మార్కెట్ పతనం మొదలయింది. నష్టాలతో సెన్సెక్స్ 150 పాయింట్లు తొలి గంటలో నష్టపోవడం చూసి షాక్ అయ్యారు.

దీనికి ప్రధాన కారణం కరోనా భయమే. పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేయడం, విదేశీ పెట్టుబడుల మీద ఆంక్షలు ఉండటం, చైనా ఉత్పత్తుల మీద నిషేధం వంటివి ప్రభావం చూపించాయనే చెప్పవచ్చు. ఇప్పటికే కరోనా దెబ్బకు చిన్న మధ్యతరహా వ్యాపారాలు భారత్ లో భారీగా నష్టపోయాయి. ఈ ఊహించని పరిణామం దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలు అవుతుంది. ఆర్ధిక ఏడాది ముగుస్తున్న తరుణంలో ఈ పరిణామం పెట్టుబడి దార్లను కలవరపెడుతుంది.

కాగా కరోనా దెబ్బ ఇప్పుడు ఇటలీ సహా గల్ఫ్ దేశాలను కూడా తాకింది. చైనా ను దాటి దక్షిణ కొరియా లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు వెయ్యి కేసులు నమోదు అయ్యాయి ఆ దేశంలో. ఇక ఇటలీ లో కూడా కరోనా కేసులు నమోదు కావడం విశేషం. భారత్ లో దీని ప్రభావం కనపడకపోయినా వాణిజ్యం చైనా భారత్ మధ్య ఎక్కువగా ఉన్న నేపధ్యంలో చైనా ఉత్పత్తుల మీద భారత్ తాత్కాలిక నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news