తల్లి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే… చెల్లి ఇంటి ముందు పడేసి పారిపోయాడు

ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. తల్లికి కరోనా వచ్చి ప్రాణాలతో పోరాటం చేస్తుంటే రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు ఒక కొడుకు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన పడుకున్న మహిళను చూసిన స్థానికులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ చికిత్స తీసుకునే సమయంలో ఆమె మరణించింది.

కాన్పూర్ లో తన కుమారుడు విశాల్ తో కలిసి ఆమె నివాసం ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో, విశాల్ తన తల్లిని చాకేరిలోని టాడ్ బాగియా ప్రాంతానికి తీసుకెళ్ళి, తన సోదరి ఇంటి బయట పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. తన తల్లి నుండి తనకు కూడా కరోనా వస్తుందనే భయంతో అతను అలా చేసాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.