ఆయన పేరు డాక్టర్ ప్రదీప్ బిజల్వాన్. వయసు 60 సంవత్సరాలు. ఆక్సీజన్ లేక ప్రాణాలు విడిచారు. అసలు దీనికి సంబంధించి కథ వింటే కన్నీరు పెట్టడం ఖాయం. ఆయన ఢిల్లీలో అనాధలకు గత పదేళ్ళ నుంచి కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి సేవలు అందిస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత కూడా ఆయన సేవలు అందించారు. ఆస్పత్రులు దొరకని వారికి కూడా ఆయన సేవ చేసారు.
ఆక్సీజన్ కూడా అందించారు. అయితే ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. చివరకు ఆయనకు బెడ్ దొరకలేదు. దీనితో ఇంట్లోనే ఆయన చికిత్స తీసుకున్నారు. చివరకు ఆక్సీజన్ అందలేదు ఆయనకు. దీనితో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆయన మరణించారు. ఐఏఎస్ అధికారులతో కలిసి సేవలు అందించిన ఆయన ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ బిజల్వాన్ యమునా ఒడ్డున గీతా ఘాట్ వద్ద, అలాగే జామా మసీదు సమీపంలోని మీనా బజార్ వద్ద సేవలు అందిస్తూ ఉంటారు.