విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం..

-

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ లో కరోనా కలకలం రేగింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్కరోజు 55 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్ లోనే విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.. ఒకవేళ ఇళ్ళకి పంపితే అక్కడి నుంచి వారి వారి తల్లిదండ్రులకు కరోనా సోకే అవకాశాలు కనిపించడంతో హాస్టల్ లోనే ఐసోలేషన్ వార్డులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

కరోనా వైరస్
కరోనా వైరస్

రెండు రోజుల క్రితం ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ చేరడంతో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ అంతా క్వారంటైన్ చేశారు. హాస్టల్ కి వెళ్లే దారిలో బారికేడ్లు అడ్డంపెట్టి మూసివేశారు. మెన్స్ హాస్టల్ వైపు అధికారులు మినహా మిగతా వారికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ లోని 1, 2, 3 బ్లాక్ లు ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. పీజీ బ్లాక్ సహా 4,6,7 బ్లాక్ లు క్వారంటైన్ వార్డులుగా మార్చారు.. అయితే ఆంధ్రా యూనివర్సిటీ లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఈ రోజు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news