అప్పుడు చిట్టిబాబు.. ఇప్పుడు అల్లూరి.. సినిమా అభిమానులపై చరణ్ ముద్ర..

-

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పోస్టర్ నిన్ననే రిలీజ్ అయ్యింది. ఇదివరకే అల్లూరి సీతారామరాజుగా టీజర్ వదిలారు. కానీ, అందులో చాలా సందేహాలను వదిలారు. అల్లూరి గెటప్ కనిపించలేదు. టీజర్ అందరికీ నచ్చినప్పటికీ అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ ని చూద్దామనుకున్నవారికి పూర్తిగా సంతృప్తి ఇవ్వలేదు. అది నిన్న వదిలిన పోస్టర్ తో నెరవేరింది. ఆకాశానికి విల్లు ఎక్కు పెట్టిన అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ గెటప్ అదిరింది.

మండే సూర్యుడిలా కాషాయ వస్త్రాలతో అచ్చం సీతారామరాజులానే కనిపించాడు. సీతారామరాజు ఎలా ఉంటాడో తెలియని వాళ్ళకి, ఇలానే ఉంటాడని చెబితే, అవును నిజమే ఆయనే ఈయన అని నమ్మేలా, ఎన్నో రోజులు గుర్తుంచుకునేలా ఉందీ పోస్టర్. ఒక్క పోస్టర్ ద్వారా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాడు. ఇది చూసిన వారంతా అప్పుడు రంగస్థలంలో చిట్టిబాబు కనిపించాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో సీతారామరాజు కనిపిస్తున్నాడని అంటున్నారు. రామ్ చరణ్ కెరీర్లో, తెలుగు సినిమాలో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర అవుతుందని అంచనా వేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ లుక్ విడుదల అవుతుంది. మరి అదెలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news