కరోనా చావు ఏంటి ఇలా ఉంది…?

-

అమ్మో కరోనా వైరస్ చావు ఏంటి ఎలా ఉంది… భయపెట్టడం కాదు నిజం. కరోనా చావు చాలా దారుణంగా ఉంది. నేను నిన్న ఒక వీధిలోకి వెళ్లాను. అక్కడ ఒక అన్న కరోనా కరోనాతో చనిపోయాడని అన్నారు. వెంటనే కుటుంబ సభ్యులను దహన సంస్కారాలకు రమ్మని కోరారు పోలీసులు. నేను కూడా వెళ్లాను… మాకు దూరపు చుట్టాలు అవుతారు. వాళ్ళను నా కార్ లోనే తీసుకు వెళ్లాను.

అక్కడికి వెళ్ళగానే పోలీసుల బందోబస్త్ ఉంది. అన్న వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. నా కొడుకుని చూడనివ్వండి తాకనివ్వండి అంటూ ఆమె అరుస్తుంది. అక్కడ ఉన్న డాక్టర్ అసలు ఆమెను దగ్గరకు రానీయవద్దు అని అక్కడ ఎస్సై తో చెప్పాడు. ఎస్సై వెంటనే లేడీ కానిస్టేబుల్ తో ఆమెను దూరంగా తీసుకువెళ్ళాడు. అన్నయ్య వాళ్ళ డాడీ ఏమో బయటకు చెప్పడం లేదు. ఆయన సోమ్మ సిల్లి పడిపోయారు.

ఆ అన్నకు 45 ఏళ్ళు ఉంటాయి. నాకు నోట మాట రావడం లేదు. బాబీ అని పిలుస్తూ ఉంటాడు ఆ అన్న. నేను కూడా చాలా సన్నిహితంగానే ఉంటాను. ఏదో కవర్ లో తెచ్చారు డేడ్ బాడీ… ఆ కవర్ లో నుంచి అన్న మొహం కనపడుతుంది. అక్కడ శవాలను కాల్చే సిబ్బంది ఉన్నారు. వాళ్ళు చాలా భద్రతలో ఉన్నారు. అసలు వాళ్ళు కూడా శవాన్ని పట్టుకోవడం లేదు. వైద్యులు ఆస్పత్రి సిబ్బందే ఉన్నారు.

అమ్మ చివరి చూపు చూసుకుంటా నా కొడుకుని అంటుంది. ఆ అన్న ముందు కరోన వైరస్ ని లైట్ తీసుకుని… వాళ్ళ అబ్బాయికి చాక్లెట్ కోసం అని వెళ్ళాడు. కరోనా వచ్చిన విషయం ఆయనకు తెలియదు. భార్య చికిత్స పొందుతుంది. పిల్లలు క్వారంటైన్ లో ఉన్నారు. కనీసం ఆయనకు తల కొరివి పెట్టే అవకాశం కూడా లేదు, కొడుకుని చివరి చూపు చూసుకోవద్దు అని పక్కకు లాగేశారు. అక్కడ కాల్చే వాళ్ళు కూడా చాలా కర్కశం గా ఉన్నారు. అసలు ఒక్క నిమిషం చూసుకుంటా అన్నా కూడా ఆపడం లేదు. తీసుకుని వెళ్లి కాలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news