ఇండియాలో మొదలైన రెండో వేవ్…?

భారత్ లో కరోనా రెండో వేవ్ మొదలైందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా రెండో వేవ్ ఇప్పుడు ఇండియాలో ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసుల తీవ్రత రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంది అని కేంద్రం వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 45,576 కొత్త కేసులతో భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 8.95 మిలియన్లను దాటింది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.

గత 24 గంటల్లో 48,493 రికవరీలు నమోదు అయ్యాయి. మరణాలు కూడా నిన్న భారీగా పెరిగాయి. 585 మరణాలు నిన్న నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 443,303 గా ఉన్నాయి. చలికాలంలో కరోనా కేసులు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనితో రాష్ట్రాలు కాస్త ఆంక్షలకు సిద్దమవుతున్నాయి.