అమ్మో కరోనా : ఏపీలో 829 మంది టీచర్లకు, 575 మంది విద్యార్ధులకి !

-

ఏపీలో స్కూల్స్ మొన్న రెండో తారీకు నుంచి ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే స్కూల్స్ తెరుచుకున్న నాటి నుంచి అందులో పిల్లలకి, టీచర్లకి భారీ ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు బయటపడటం సంచలనంగా మారుతుంది. ఇప్పటి దాకా ఏపీలో 869 మంది టీచర్లకు 575 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు చెబుతున్నారు. ఏపీలో స్కూల్స్ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా 70,790 మంది టీచర్లకు కరోనా టెస్ట్ చేయగా అందులో 829 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది అలానే 95, 763 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా అందులో 575 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 141 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. విజయనగరంలో ఇద్దరు విద్యార్థులకు ఆరుగురు టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. అలానే విశాఖపట్నంలో 50 మంది ఉపాధ్యాయుల కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే 139 మంది ఉపాధ్యాయులకు ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఆ జిల్లాలో అత్యధికంగా 291 మంది విద్యార్థులకు 181 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది.

 

గుంటూరు జిల్లా విషయానికి వస్తే 141 మంది విద్యార్థులకు అలానే 72 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రకాశం జిల్లాలో నలుగురు విద్యార్థులకు ముగ్గురు టీచర్లు కరోనా పాజిటివ్ అని తేలింది. నెల్లూరు జిల్లాలో 27 మంది విద్యార్థులకు అలానే 38 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే 119 మంది విద్యార్థులకు అలానే 72 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. కడప జిల్లా విషయానికి వస్తే 23 మంది టీచర్లకు ఒక విద్యార్థికి అని తేలింది.

 

చిత్తూరు జిల్లాలో 63 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. అనంతపురం జిల్లాలో 18 మంది విద్యార్థులకు 59 మంది టీచర్లకు కరుణ పాజిటివ్ అని తేలింది. ఇక చిత్తూరు జిల్లాలో కరోనతో ఉపాద్యాయుడు మృతి చెందారు. బుచ్చి నాయుడు కండ్రిగ మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు రెడ్డి పల్లి దినేష్ చెన్నైలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news