కేంద్రం కీలక ప్రకటన… చిన్నారులకు వ్యాక్సిన్ పై ప్రణాళిక

-

కోరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముంచుకొస్తున్న వేళ కేంద్ర, రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. కేంద్ర, రాష్ట్రాలకు ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందించింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెంచేలా రాష్ట్రాలకు సూచనలు చేసింది. అయితే తాజాగా పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా కేంద్రం ప్రణాళికలను రూపొందిస్తుంది.

ఇండియాలో జైకోవ్ డి, కోవాగ్జిన్, కార్బివాక్ టీకాలను 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలలకు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డా. ఎస్ కే అరోడా తెలిపారు. దేశంలోని 44 కోట్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారుకు తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు. డిసెంబర్ నెలలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఉంటుందని తెలిసింది.

ముఖ్యంగా 12 ఏళ్లకు పైబడి 18 ఏళ్లకు లోపు ఉన్న పిల్లలకు ఉద్దేశించి జైకోవ్ డి వ్యాక్సిన్ ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా కోటి డోసులకు ఆర్డర్ కూడా చేసింది. మూడు డోసులుగా ఉన్న జైకోవ్ డి వ్యాక్సిన్ ను రెండు డోసులకు తగ్గించేలా కేంద్రం ప్రణాళిక రూపొందిస్తుంది. మరోవైపు కోవాగ్జిన్ కూడా తన ట్రయల్స్ ను పూర్తి చేసింది. దీంతో వచ్చే నెలలో చివరిలో 18 ఏళ్లకు లోపు ఉన్న పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.

Read more RELATED
Recommended to you

Latest news