కరోనా: నేటి నుండే అమల్లోకి రానున్న సరికొత్త వ్యాక్సిన్ విధానం.

18సంవత్సరాల వయసు పైబడ్డ వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. ఆ వాగ్ధానం నేటి నుండే అమల్లోకి రానుంది. ఈరోజు నుండి భారత దేశ వ్యాప్తంగా 18ఏళ్ళు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొదటగా వ్యాక్సిన్ విధానంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి విపరీతమైన అంతరాలు ఏర్పడ్డాయి. జీస్టీ దేశమంతా ఒకేలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఎక్కువ ధర చెల్లించాలని ప్రశ్నలు వచ్చాయి.

దాంతో దిగి వచ్చిన కేంద్రం దేశమంతా ఒకే వ్యాక్సిన్ విధానాన్ని తీసుకువచ్చింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటు రష్యా నుండి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ ని ప్రజలకు ఇవ్వనున్నారు. ఇప్పటికే సూపర్ స్ప్రెడర్లుగా భావించిన వారందరికీ వ్యాక్సినేషన్ మొదలైంది. ఇక ఇప్పుడు దేశమంతా 18సంవత్సరాల పైవారందరికీ వ్యాక్సిన్ మొదలు కానుంది. వ్యాక్సిన్ వేగంగా పూర్తయితేనే కరోనా థర్డ్ వేవ్ నిరోధించగలమని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే.