యోగా ఏ ఒక్క మతానిది కాదు: రాష్ట్ర‌పతి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాష్ట్ర‌పతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆయన నివాసంలో యోగాసనాలు వేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన దేశ ప్రజలకు సందేశాన్నిచ్చారు. యోగా ఏ ఒక్క మతానికి కాదన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాన్ని పొందవచ్చని చెప్పారు. మనస్సు-శరీరాన్ని ఏకతాటిపైకి తీసుకురావచ్చొన్నారు.

దృష్టి ఏకాగ్రతతో లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటన్నారు. కోవిడ్ -19 సమయంలో యోగా చాలా సహాయపడుతుందని రామ్ నాథ్ కోవింద్ వివరించారు. యోగా డే సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

యోగాను ప్రతిఒక్కరూ దినచర్యగా పాటించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు నిచ్చారు. అంతర్జాతీయ యోగా డే సందర్బంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి యోగా కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

ఇక యోగా డే సందర్భంగా దేశంలో పలుచోట్ల బీజేపీ అగ్రనేతలు యోగాసాలు వేశారు. సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి ప్రహ్లాడ్ సింగ్ పటేల్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్‌లో యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫైనాన్స్ , కార్పొరేట్ వ్యవహారాల ఇంఛార్జి అనురాగ్ ఠాగూర్ తన నివాసంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపు నిచ్చారు.