ఏ ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, అన్ని దేశాల ప్రభుత్వాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తలు పడుతున్నాయి. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. ఇతర దేశాలు ఎలాగూ ప్రజలకు అన్ని జాగ్రత్తలు చెప్తూ… వారి భద్రతను చూసుకుంటున్నాయి.
మన దేశంలో జనాలకు కాస్త చాదస్తం ఎక్కువ. ఏమవుద్ది లే బయటకు వెళ్తే అంటారు. ఏమవుద్ది నాశనం అయ్యే వరకు ఏమీ అవ్వదు. చైనాలోని ఊహాన్ నగరం లో కరోనా వైరస్ వస్తే అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎం చెప్తే అది చేసారు. కోటి మంది జనాభా ఉన్న నగరం అది. ప్రజలు ప్రభుత్వ సూచనలను అన్ని విధాలుగా పాటించి బయటకు రాకుండా వ్యాధిని నియంత్రించారు.
దీనితో కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కి పడిపోయింది అక్కడ. ఇక్కడ మన దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలు గుమి గూడకుండా ఉండాలని చెప్తున్నాయి. అలాగే జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కువగా గడపవద్దని సూచిస్తున్నాయి. పెళ్ళిళ్ళు పేరంటాలు వద్దని చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల సలహాలు పాటించాలీ. ఇష్టం వచ్చినట్టు ఏమవుద్ది ఎన్ని చూడలేదు అని చాదస్తపు మాటలు మాట్లాడితే వైకుంఠమే.
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మీతో పాటు జనం కూడా ఇబ్బంది పడటం అనేది ఖాయం. అనవసర ప్రయాణాలు చేయకండి. మీకు ప్రాణం మీద తీపి లేకపోవచ్చు ఇతరులకు ఉంటుంది. మీ వలన ఇతరులకు సోకుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏవీ పిచ్చి వాగుడు వాగాట్లేదు. వాళ్లకు పని లేక ఈ పని పెట్టుకోలేదు. ప్రభుత్వ సూచనలు పాటించండి. మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి. ఎందుకంటే దీనికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం.