గోకుల్ నగర్ కాలనీలో పేదలకు ఆహార పొట్లాల పంపిణీ..

-

తెలంగాణ రాష్ట్రంలో కోరలు చాస్తున్న కరోనా వైరస్ పేదప్రజల ఉపాధిని దెబ్బతీసింది. పరిశ్రమలన్నీ మూతపడటంతో పేదల బ్రతుకు భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో పేదల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యాపారవేత్త రామ్ రాజ్.. ఈ రోజు (బుధవారం) గోకుల్ నగర్ కాలనీలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కాలనీ అధ్యక్షులు మల్కయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యక్తిగత దూరం పాటిస్తూ క్యూ లైన్‌లో వచ్చి పేదలు ఆహార పొట్లాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా వ్యాపారవేత్త రామ్ రాజ్ మాట్లాడుతూ.. ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలను గుర్తించి ఆహారపొట్లాలు అందిస్తున్నామని అన్నారు.
”కాంక్రీట్ పరాజో అపార్ట్‌మెంట్” (నాచారం) లోని దాతలు ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఈ రోజు మల్లాపూర్ పరిధిలోని గోకుల్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారని పేర్కొన్నారు.

వాలంటీర్ల సహాయంతో నాచారం, మల్లాపూర్ పరిధిలోని నిరుపేదలను, రేషన్ కార్డు లేనటువంటి రోజువారి కూలీలను గుర్తించి వారికి 10 రోజులకు సరిపోయే నిత్యవసర సరుకులు అందించబోతున్నామని వ్యాపారవేత్త రామ్ రాజ్ అన్నారు. 700 కుటుంబాలను ఆదుకునేలా మిత్రులు వెంకట్రావ్ అండ్ టీమ్ సహకారంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆయన చెప్పారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం అమలు చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news