తెలంగాణాలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం ఉన్న బాధితులకు కూడా కరోనా పూర్తిగా నయం కావడమే కాకుండా… కేసుల సంఖ్య బుధవారం భారీగా తగ్గింది తెలంగాణాలో. కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్,
మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలను హాట్‌స్పాట్ జిల్లాలుగా గుర్తించింది. ఇక్కడ లాక్ డౌన్ అమలు చాలా కఠినం గా ఉంటుంది. ఇక కేసులు తగ్గడం తో తెలంగాణా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసులు 650 గా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా రాబోయే రెండు వారాల్లో తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకా కేసులు నమోదు అయినా కూడా పటిష్ట చర్యలతో తెలంగాణా సర్కార్ సిద్దంగా ఉంది.
ఇప్పుడు కేసులు భారీగా తగ్గితే మాత్రం కొన్ని చోట్ల లాక్ డౌన్ ని సడలించే అవకాశం ఉందని అంటున్నారు. వీరిలో 118 మంది కోలుకోగా.. 18 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 514 మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. వీరు అందరూ కూడా రాబోయే రెండు వారాలలో డిశ్చార్జ్ కానున్నారు. దీనితో ప్రభుత్వం కొత్త కేసులు రాకుండా చర్యలు తీసుకుంటుంది.