వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం ఎలా..?

-

వాతావరణ పరిస్థితిని బట్టి మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి అనారోగ్య సమస్యలే కాదు చర్మ స్థితిగతులు ఒక్కోసారి మనకి ఇబ్బందిని కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలం చర్మ వ్యాధులు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

వింటర్ సీజన్ లో డెడ్ సెల్స్ ఎక్కువగా చర్మం మీద పేరుకుపోయి ఉంటాయి.. వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోతే అవి మరిన్ని సమస్యలకు దారితీస్తాయి. సాల్ట్ ద్వారా కాని.. షుగర్ స్క్రబ్ ద్వారా కాని చర్మం మీద నిలిచి ఉన్న మృత కణాలను తొలగించుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ సెల్స్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ మృత కణాలను తొలగించేందుకు ఇంట్లోనే అవసరమైన మిశ్రమం తయారు చేసుకోవచ్చు.

బ్రౌన్‌ షుగర్‌, వైట్‌ షుగర్‌, ఆలివ్‌ ఆయిల్‌, కొన్ని ల్యావెండర్‌ ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ అన్నిటిని కలిపి ఓ మిశ్రమం తయారు చేసుకోవచ్చు. ఆలివ్‌ ఆయిల్, కొబ్బరినూనెతో మర్దనా చేస్తే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. స్నానం చేసిన తర్వాత బాడీ లోషన్‌ తో స్మూత్ గా మర్దనా చేసుకుంటే మంచిది. అరటిపండు, అవకాడో, మూడు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు.

రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. వేసవి కాలం ఎండ తావ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎండకు ఎటూ వెళ్లకుండా ఉంటే బెటర్. ఎండకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చర్మం మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news