సోమవారం నుంచే ఆనందయ్య మందు… క్లారిటీ…!

కృష్ణపట్నం గోపాలపురంలోని సీవీఆర్ అకాడమీలో మందు తయారీ ప్రారంభించాను అని సోమవారం నుంచి పంపిణీ మొదలెడతాం అని బోనిగి ఆనందయ్య అన్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరిక మేరకు, ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష మందికి మందు పంపిణీ జరుగుతుంది అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు. కరోనాతో బాధపడే వారికి, ఎక్కడికక్కడే మందుగా మందు పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు అని ఆయన వివరించారు.

ఎవరూ కృష్ణపట్నం రావొద్దు అని కోరారు. కంటి మందుకి కూడా అనుమతి రావొచ్చని ఆశిస్తున్నాం అని తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మేము ఒకప్పుడు శిష్యులమే అని మందు అనుమతి కోసం ఆయన చూపిన చొరవ మరువలేను అని చెప్పుకొచ్చారు. మందు పంపిణీ కొనసాగింపు కోసం కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.