కరోనా రెచ్చిపోతుంది… ఎవరూ బయటకు రాకండి…!

-

దేశ వ్యాప్తంగా అదుపులోకి వచ్చినట్టే వచ్చిన కరోనా ఒక్కసారిగా రెచ్చిపోవడం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. తగ్గింది, కట్టడి అవుతుంది అనుకున్నారు అందరూ… కాని అనూహ్యంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఇప్పుడు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 17 పెరిగాయి. దీనితో ఏపీలో ఇప్పుడు 40 కేసులు నమోదు అయ్యాయి.

మహారాష్ట్ర కర్ణాటక సహా పలు ప్రాంతాల్లో ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. కరోనా కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు తెలంగాణాలో. దీనితో అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశంలో కరోనా 3వ స్టేజీకి వెళ్లిందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మార్చి 1 నుంచి నుంచి 15వ తేదీ వరకు జరిగిన మత ప్రార్థనల్లో 2,500 మంది పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ తర్వాత మర్కజ్‌ భవనంలోనే 1,200 మంది ఉన్నట్లు గుర్తించిన నిన్నటి నుంచి 850 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఇప్పుడు అవసరం అయితే మినహా ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండటమే మంచిది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రజలు అనవసరంగా బయటకు వస్తే ప్రాణాలకే ప్రమాదమని అంటున్నారు. ప్రాణం పోయినా సరే బయటకు రావొద్దు ఎవరూ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news