మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం… 338 వైద్యులకు సోకిన కరోనా.

-

మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. దేవంలోనే ఎక్కువగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ముఖ్యంగా ముంబై మహానగరంలోనే కేసులు అధికంగా ఉంటున్నాయి. ఇదిలా ఉంటే కరోనా బారిన వైద్యులు కూడా పడుతున్నారు. మహారాష్ట్రలో వివిధ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 338 వైద్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది. గత నాలుగు రోజుల్లోనే ఈ కేసులన్నీ నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.

మహారాష్ట్ర మరోసారి కోవిడ్ మహా ముప్పును ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముంబై నగరంలో కేసుల సంఖ్య 20 వేలు దాటితే లాక్ డౌన్ విధిస్తామని గతంలో మేయర్ చెప్పిన సంగతి తెలిసిందే. గురువారం ఒకే రోజు రికార్డ్ స్థాయిలో  కేసులు వచ్చాయి. రాష్ట్రంలో 36,265 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, ఇది అంతకుముందు రోజు కంటే 36% ఎక్కువ. రాజధాని నగరం ముంబైలో మాత్రమే 20,181 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 13 మరణాలు మరియు 79 ఓమిక్రాన్ కేసులు కూడా నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news