ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికిప్పుడు కోరుకునేది ఏంటి? ఏం కావాలని అనుకుంటున్నారు? అంటే.. సెంటిమెంటును కోరుకుంటున్నారు. ప్రజల్లో తన పట్ల పోయిన సింపతీని మ ళ్లీ గెలుచుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వేసే ప్రతి అడుగులోనూ ఏదొ ఒక వ్యూహం కనిపి స్తోందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి సెంటిమెంటు రాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చం ద్రబాబును మించిన నాయకుడు మరొకరు ఉండరు. తనకు ప్రతికూలంగా ఉన్న వస్తువు నుంచి కూడా బా బు సెంటిమెంటును పండించ గల దిట్టగా పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు జగన్ ప్రబుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కరోనా వైరస్ తీవ్రత నుంచి రాష్ట్ర ప్రజలను ఎలా కా పాడాలో చెబుతూ.. ఎలాంటి సాయం అందించాలో ఆయన దిశానిర్దేశం చేశారు. అయితే, ఏ ప్రభుత్వమైనా .. తనవంతు బాధ్యతగా తన నిర్ణయాలు తను తీసుకుంటుంది. ప్రజలకు మేలుచేస్తుంది. అయితే, బాబు లేఖ రాయడం వెనుక వ్యూహం ఏంటంటే.. తాను ప్రజలకు అన్నివేళలా అంటిపెట్టుకుని ఉన్నానని చెప్పు కొనేం దుకు, ఆ లేఖలో ఏదైనా ప్రభుత్వం అమలు చేస్తే.. అదిగో నేను చెప్పిన తర్వాతే.. ప్రజలకు ఇది అందింద ని రేపు డబ్బా కొట్టుకునేందుకు ఆయనకు ఉపయోగ పడుతుంది.
ఇక, మరో వ్యూహానికి కూడా బాబు తెరదీశారు. అదే.. కరోనా సహాయకచర్యలకు సంబంధించి తన వంతు విరాళంగా ప్రభుత్వ ఖజానాకు రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. తన పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల ఒకనెల వేతనాన్ని కూడా తాము విరాళంగా ఇస్తున్నామని బాబు ప్రకటించారు. ఇది మంచి పరిణామమే. ప్రజలు ఆపదలో ఉంటే.. వారిని ఆదుకునేందుకు చేసే ప్రయత్నం. అయితే, ఈ విరాళాలను అడ్డు పెట్టుకుని .. వైసీపీ నేతలపై విమర్శలు చేయడం బాగోలేదని అంటున్నారు విశ్లేషకులు. మేం ఇచ్చాం కాబట్టి మీరు కూడా ఇవ్వాలనే ధోరణిలో బాబు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా.. బాబు ఈ సమయంలోనూ రాజకీయాల్లో లబ్దిని కోరుకుంటుండడం విచారకరం అంటున్నారు పరిశీలకులు.